తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Agniban: నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’

భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలు రాయి వచ్చి చేరింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాణ్ ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో నాలుగు సార్లు ఈ ప్రయోగం వాయిదా పడగా, ఐదవ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించారు.

సోమనాథ్ పర్యవేక్షణలో

చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది… భూమికి 700 కిలో మీటర్లు ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారిన ఈ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది.. భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగాలను ఇస్రో ప్రోత్సహిస్తుంది.

ALSO READ: ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. కార్యక్రమాలివే!

ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిపై అగ్నికుల్‌ కాస్మోస్‌కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌కూల్డ్‌ ద్రవ ఆక్సిజన్‌ ఆధారంగా ఒక స్టేజిలోనే పనిచేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. ఒకవేళ ప్రయోగం అదుపుతప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్‌ టర్మినేషన్‌ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు. పలురకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు. 300 కిలోలలోపు బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు దొరకవు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్‌ నిర్మించిన రాకెట్‌ సరిపోతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button