తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 09: చరిత్రలో ఈరోజు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఉగాది పండుగ వచ్చింది. ఈసారి తెలుగు ఏడాది శ్రీ ‘క్రోధి’నామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది. ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు

జయ బచ్చన్ బర్త్ డే

ప్రముఖ నటి , రాజ్యసభ ఎంపీ ఏప్రిల్ 9న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అభిమాన్, చుప్కే చుప్కే, షోలే, మరియు కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించారు. నటుడు అమితాబ్ బచ్చన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆమె రికార్డు స్థాయిలో తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ ని అందుకున్నారు.

ఏ.ఎం.రాజా వర్థంతి

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా 1929 జూలై 1వ తేదీ చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో జన్మించారు. తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’ సినిమాలో పాడిన పాటలకు ఆయనకు గుర్తింపు లభించింది. ఘంటసాల, రాజా ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల పాడారు. 1989 ఏప్రిల్ 9న ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతూ కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. వివిధ భాషలలో దాదాపు వెయ్యి పాటలు పాడిన రాజా, సుమారు 30 చిత్రాలకు సంగీతం అందించారు.

ఫొనాటోగ్రాఫ్ యంత్రం ఆవిష్కరణ

ధ్వనిని రికార్డ్ చేయడానికి ఈనాడు చాలా రకాల పరికరాలు అందుబాటులో వున్నాయి. మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం. గతంలో టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు. వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పటి నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860, ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం. దీనిని మొట్ట మొదట ఫ్రెంచ్ మెన్ Édouard-Léon Scott de Martinville కనుక్కోన్నారు. దానిమీద పూర్తి అధికారాలు మార్చి 25, 1857 లో పొందారు.

మొదటిసారి బార్బీడాల్ ప్రదర్శన

ఇష్టమైన బొమ్మ అని అడిగితే? దాదాపు ప్రతిఒక్కరి నోటి నుంచి వచ్చే పేరు.. బార్బీడాల్‌! అంతలా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అందాల బొమ్మ. 1959లో న్యూయార్క్‌లోని అమెరికన్‌ టాయ్‌ ఫెయిర్‌లో తొలిసారి ఏప్రిల్ 9న బార్బీడాల్ ను ప్రదర్శించారు. మార్కెట్లోకి వచ్చిన మొదటిసారే మూడు లక్షల బొమ్మలు అమ్ముడుపోయాయంటే చూడండి.. బార్బీకున్న కొత్తదనం. బార్బీ బొమ్మ కొత్తది తయారు కావాలంటే 13 నుంచి 18 నెలలు పడుతుంది.

మన్నవ బాలయ్య పుట్టినరోజు

గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో ఏప్రిల్ 9, 1930లో నటుడు మన్నవ బాలయ్య జన్మించారు. మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించే అవకాశం లభించింది. ఈయన ఇప్పటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు.

మరికొన్ని విశేషాలు

  • అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గాను ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా అన్నా హజారేకు కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
  • కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్య సమరయోధుడు చండ్ర రాజేశ్వరరావు 1994 మరణించారు.
  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య వర్థంతి నేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button