తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Chicken: భారీగా పెరిగిన నాన్ వెజ్ గిరాకీ… రికార్డు స్థాయిలో అమ్మకం

తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. మన వాళ్లకి ముక్క లేనిదే బుక్క కూడా దిగాదు. మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే మరి డిసెంబర్ 31 న ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో నాన్-వెజ్‌కి గిరాకీ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాదీలు మటన్, చికెన్‌ను బాగా ఆస్వాదించారు. సాధారణ రోజుల కంటే నిన్న ఒక్కరోజే ఒకటిన్నర రెట్ల చికెన్ అమ్ముడుపోయిందట. సాధారణంగా హైదరాబాద్‌లో ప్రతిరోజు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతాయి. కానీ డిసెంబర్ 31 కారణంగా 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి.

Also Read: మహాలక్ష్మీ పథకంతో కొత్త చిక్కులు… సీట్ల కోసం మహిళల కొట్లాట

నిన్న ఒక్కరోజే 10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ ధర 900 రూపాయల వరకు పలుకుతోంది. అయినప్పటికీ దాదాపు 25వేల నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. న్యూఇయర్ రోజైన.. ఈ రోజు కూడా విక్రయాల్లో జోరు కనిపిస్తోందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button