తెలుగు
te తెలుగు en English
తెలంగాణప్రత్యేక కథనం

Gajwel కేసీఆర్ ఓటమి పక్కానా? బిడ్డకు పట్టిన గతి తండ్రికి కూడానా?

గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ (Gajwel)తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తుండడం వెనుక అసలు కథ ఏమిటో ఇప్పటివరకు బయటకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్గాలు కూడా ఇది కారణమని ఒక స్పష్టత ఇవ్వడం లేదు. కాకపోతే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రెండో పోటీ ఎందుకు చేస్తున్నాడనేది తెలుస్తోంది.

Also Read: Glass Symbol పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్.. గ్లాస్ గుర్తు పాయే..

గజ్వేల్ లో కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) పని అయిపోయిందని సమాచారం. ఎందుకంటే గజ్వేల్ స్థానానికి దాఖలైన నామినేషన్లు చూస్తుంటేనే తెలిసిపోతున్నది. కేసీఆర్ (KCR)కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ధరణి, మల్లన్నసాగర్ బాధితులతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశంతో చాలా మంది స్వతంత్రులుగా బరిలోకి దిగారు. దీనికి తోడు బీజేపీ అగ్ర నాయకుడు ఈటల రాజేందర్ (Eatala Rajender) కూడా పోటీకి దిగడంతో గజ్వేల్ పోరు రసవత్తరంగా మారింది.

భారీగా నామినేషన్లు
గజ్వేల్ లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా చాలా మంది పోటీలోకి దిగారు. వారిలో ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)లోని వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన 45 మంది ఉన్నారు. ఇంత మంది ఒకేసారి నామినేషన్లు వేయడం సంచలనం రేపుతోంది. వారంతా ధరణి పోర్టల్ తో మోసపోయిన బాధితులు. ధరణి (Dharani Portal) కారణంగా వారికి చెందిన 460 ఎకరాల భూమి విషయంలో అన్యాయం జరిగిందనే కారణంతో నామినేషన్లు వేశారు. ఇక మరి కొంతమంది నిరుద్యోగులు, రైతులు, మల్లన్నసాగర్ నిర్వాసితులు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగియగా వాటిని పరిశీలించిన అనంతరం తుది పోరులో ఎవరు ఉన్నారనేది ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. మొత్తం 65మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉండవచ్చు. అభ్యర్థుల పోటీ భారీగా ఉండడంతో కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

కవిత మాదిరిగా..
ఎందుకంటే నిజామాబాద్ లోక్ సభ ఎన్నికను గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేయగా.. ఆమెకు వ్యతిరేకంగా వందల సంఖ్యలో రైతులు (Farmers) పోటీలో నిల్చున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ ఉండడంతో నిజామాబాద్ (Nizamabad) ఎన్నిక దేశంలోనే అరుదైన గుర్తింపు పొందింది. అంత మంది పోటీలో ఉండడంతో కవిత ఓటమి పాలయ్యింది. ఇప్పుడు కూతురి లాగే తండ్రి కేసీఆర్ కూడా ఓటమి చెందుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: ఎన్నికలకు హీరోయిన్ సౌందర్యకు ఏం సంబంధం? మీకు తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button