తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Indian Food: మీకు తెలుసా.. విదేశాల్లో నిషేధించబడిన భారతీయ వంటలు

భారతీయులు ఆహార ప్రియులు.. తిండి అంటే ఎనలేని ప్రేమ చూపిస్తారు. ఇండియాలో కొన్ని వంటకాలు చాలా ఫేమస్​. అలాంటివి ఎక్కడైన రోడ్డుపై కనపడితే చాలు.. వెంటనే అక్కడ వాలిపోతాం. ఇప్పటికి.. ఎప్పటికి ఇండియాలో కొన్ని ఆహార పదార్థాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే భారతదేశంలో ఎంతోమంది ప్రజలు లొట్టలేసుకుంటూ తినే 7 ఆహార పదార్థాలను ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి.

Also read: Viral Video: న్యూ ఇయర్ వేళ వైరల్ వీడియో.. సలార్ డైలాగ్ వాడుకున్న పోలీసులు

నెయ్యి:

ఇండియాలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉపయోగించే నెయ్యిని అమెరికాలో నిషేధించారు. ఎందుకంటే నెయ్యి తింటే ఊబకాయం, గుండెపోటుకు కారణమవుతుందనే ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు నెయ్యిని నిషేధించాయి.

సమోసా:

భారతీయులు సమోసాను ఎంత ఇష్టంగా తింటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. రోడ్ సైడ్ సమోసా బండి ఎక్కడ కనిపించినా లాగించేస్తుంటారు. ఈవెనింగ్ స్నాక్స్‌గా సమోసా తీసుకునే వారే ఎక్కువమంది ఉంటారు. అయితే ఈ రుచికరమైన చిరుతిండిని సోమాలియాలో నిషేధించారు.

జ్యూసీ కబాబ్స్:

భారతదేశంలో కబాబ్స్‌ను చిరుతిండిగా ఉపయోగిస్తారు. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్, పన్నీర్, వెజిటెబుల్స్ కబాబ్స్ ఇలా ఎన్ని ఉన్నా వాటిని భారతీయులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఎంతో కాలం నుంచి ఈ జ్యుసీ కబాబ్‌ సంప్రదాయంగా వస్తున్నప్పటికీ దీన్ని వెనిస్‌లో నిషేధించారు.

గసగసాలు:

భారతీయ వంటకాలు, మసాలా దినుసుల్లో గసగసాలు ప్రధానమైనవి. వీటిలో ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ గుణాలు కలిగి ఉంటాయి. గసగసాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలాగే దగ్గు, ఆస్తమాను తగ్గిస్తాయి. గుండె సమస్యతో బాధపడుతున్న వారికైతే ఈ గసగసాలు మంచి ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. అయితే వీటిని సింగపూర్ అండ్ తైవాన్‌ దేశంలో నిషేధించారు.

చావన్ ప్రష్:

ప్రముఖ భారతీయ ఆయుర్వేద సప్లిమెంట్ చ్యవన్‌ప్రష్‌ను కెనడాలో 2005 నుంచే వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే చ్యవనప్రష్‌లో సీసం, పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది.

జెల్లీ కప్స్:

జెల్లీ కప్పులను చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు. ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా వీటికి తింటున్నారు. కానీ ఈ జెల్లీ కప్పులను ఆస్ట్రేలియాలో అస్సలు అనుమతించరు. ఇవి తింటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అక్కడున్న ఆరోగ్య నిపుణులు జెల్లీ కప్పులను నిషేధించారు.

టమాట కెచప్:

ఎగ్ పఫ్, కర్రీ పఫ్, ఏదైనా స్నాక్ ఐటమ్స్ తింటే అందులో కెచప్ ఉండాల్సిందే. చిరుతిండుల్లో టమాట సాస్ లేనిది భారతీయులు అస్సలు తినరు. అయితే ఈ కెచప్‌ను ఫ్రాన్స్‌లో నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button