తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Naa Saamiranga: నాగార్జున మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్

నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బాణీలకు, ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. “నా సామిరంగ” అంటూ ఎంతో హుషారుగా సాగే ఈ టైటిల్ సాంగ్ ను కీరవాణి తనయుడు కాలభైరవ, ‘చిచ్చా’ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

Also Read: నేడు పీపుల్స్ స్టార్ పుట్టినరోజు

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నా సామిరంగ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం 2024 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని అందరిలో మూవీ పై బాగా అంచనాలు పెంచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button