తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 23: చరిత్రలో ఈ రోజు

తాళ్లపాక అన్నమయ్య మరణం

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు 1503 ఫిబ్రవరి 23న మరణించారు. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది.

కింజరాపు ఎర్రన్నాయుడు పుట్టినరోజు

టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు 1957లో శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మ. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 11, 12, 13, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయాన్ని 2022, ఫిబ్రవరి 23న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు. అయితే రెండు నెలల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్జ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, మన్నిక, నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రెండు ఆస్కార్ అవార్డులు

సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఎ. ఆర్‌. రెహమాన్‌. ఈయన రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగానూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (జయహో), బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో 2009 ఫిబ్రవరి 23న ఆస్కార్‌ అందుకున్నారు. ‘రోజా’తో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన రెహమాన్‌.. భారతీయ సినిమాలతోపాటు హాలీవుడ్‌ చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.

మరికొన్ని విశేషాలు

  • భారతదేశానికి చెందిన అమెరికన్ న్యాయవేత్త పద్మనాభన్ శ్రీకాంత్.. శ్రీ శ్రీనివాసన్ 1967 ఛండీగఢ్ లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు 1960లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో రెండో అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా నియమితులైన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు.
  • భారతీయ మోడల్, నటుడు కరణ్ గ్రోవర్ సింగ్ 1982 ఢిల్లీలో జన్మించారు. టెలివిజన్ సీరియల్స్, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి పలు అవార్డులు గెలుచుకున్నారు. ఈయన భార్య బిపాసా బసు.
  • అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ 1848 ఫిబ్రవరి 23న మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button