తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

INDIAN RAILWAY: ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న రైల్వే.. తాజాగా మరికొన్ని రైళ్లు రద్దు

ప్రయాణీకులకు రైల్వే అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. విజయవాడ– విశాఖపట్నం మార్గంలో 10 రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరో 15 సర్వీసులను రీ షెడ్యుల్ చేసింది. పగటి పూట వెళ్లే రైళ్లు రద్దకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రిజర్వేషన్ టికెట్లను అర్థంతరంగా రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సింహాద్రి, రత్నాచల్, ఉదయ్ ఎక్స్ ప్రెస్, రాయగడ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. విశాఖ- విజయవాడ మధ్య రోజూ వేలాది మంది ఈ రైళ్లలోనే గమ్యస్థానాలకు చేరుకుంటారు.

Read also: Transfers of Ditrict collectrs in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ

మరోవైపు ప్రయాణీకుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో విశాఖ- లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రీషెడ్యూల్ చేసి అధికారులు పునరుద్ధరించారు. విజయవాడ- ఖాజీపేట మీదుగా వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్ ప్రెస్ ను దారి మళ్లించారు. ఇక ఆగస్టు 10 వరకు రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్, విశాఖ- మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, విశాఖ- తిరుపతి డబుల్ డెక్కర్ సహా మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కడియం- నిడదవోలు, ఖాజీపేట- బల్లార్షా సెక్షన్ల మధ్య జరుగుతున్న రైల్వే సేఫ్టీ వర్క్స్ కారణంగా సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button