తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Navy Milan- 2024: విశాఖలో నేవీ ఉత్సవాలు.. పలు దేశాల అధికారులు హాజరు

విశాఖలో నేవీ మిలన్- 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది హాజరుకానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం 50 దేశాల నుంచి నేవీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొనున్నాయి. 2022 తర్వాత మళ్లీ రెండేళ్లకు దీనిని విశాఖలోనే నిర్వహిస్తున్నారు.

Also read: TTD: పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ సాయం కోరిన అయోధ్య ట్రస్ట్

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ ​నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ​ఖడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మిలన్- 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్​ లో జరిగే ఈ అంతర్జాతీయ నేవీ పరేడ్ ​లో వివిధ దేశాలకు చెందిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్ ​ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button