తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

New Year Offers: న్యూ ఇయర్ కి బడా ఆఫర్లు.. తింటే తిన్నంత.. తాగితే తాగినంత

కొద్ది రోజుల్లో 2024 కొత్త సంవత్సరం రాబోతుంది. దీంతో ఇప్పటికే చాలా మంది పార్టీలకు, ట్రిప్‌లకు ప్లాన్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హోటల్స్, మాల్స్, రిసార్ట్స్ న్యూయర్ పార్టీకి సిద్ధమవుతున్నాయి. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పలు చోట్ల సన్నాహాలు అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ బడా హోటల్‌లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతాయని అందరికీ తెలిసిందే.

Also read: Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. నిలిచిన విమాన రాకపోకలు

అసలు విషయంలోకి వెళితే.. కొండాపూర్ నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడికి నగర ప్రజలు చేరుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ఏడాది కూడా డిసెంబర్ 31న రాత్రి 8 గంటలకు ఈ సెలబ్రేషన్స్ ప్రారంభంకానున్నాయి. ఈ పార్టీకి వెళ్లాలంటే ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. సాధారణంగా ఒక్క టికెట్ ధర రూ. 7,080 నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. అలాగే సింగిల్ లగ్జరీ పాస్‌కు ఒకరికి రూ.8,260 చెల్లించాలి. ఒక టికెట్‌కి ఒకరికి మాత్రమే ఎంట్రీ ఉంటుందట.

అంతేకాదండోయ్ ఒక్కసారి టికెట్ బుక్ చేసుకుంటే ఏది ఏమైనా పార్టీకి హాజరు కావాల్సిందే. వెళ్లలేక పోతే డబ్బులు రీఫండ్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు. పైసలు వేస్ట్ కాకూడదంటే పార్టీకి వెళ్లి తీరాల్సిందే. కనీసం 30 నిమిషాల ముందే పార్టీకి హాజరు కావాలి. ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా చూపిస్తేనే లోపలికి పంపుతారు. ఇక ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఏడాది వ్యాక్సినేషన్ తీసుకున్న సర్టిఫికెట్ కూడా చూపించాలి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పార్టీలో ఏం తినాలంటే అది తమకు నచ్చినంత వడ్డించుకుని తినొచ్చు. అలాగే మందు కూడా తాగినంత తాగొచ్చు. మరి మీరు రెడీనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button