తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Tunnel Roads: హైదరాబాద్ లో సొరంగం రోడ్లు.. రూట్లు ఇవే!

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టన్నెల్ రోడ్లు నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరంలోని ఐదు ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కి.మీ. మేర సొరంగ టన్నెల్ రోడ్ల నిర్మాణానికి నివేదిక రూపొందించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు టెండర్లను పిలిచారు.

Also read: Snow Fall: హిమాచల్ ప్రదేశ్ లో భారీగా హిమపాతం.. ప్రజల ఇబ్బందులు

  • ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా ఖాజాగూడ, నానక్ రాంగూడ వరకు- 9 కి.మీ.
  • ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వరకు వయా మైండ్ స్పేస్ జంక్షన్ వరకు -8 కి.మీ.
  • ఐటీసీ కోహినూర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10.. వయా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వరకు- 7 కి.మీ.
  • జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్ వరకు- 6 కి.మీ.
  • నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్డు వయా చార్మినార్, ఫలక్ నుమా వరకు- 9 కి.మీ.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button