తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 11: చరిత్రలో ఈరోజు

జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

నేషనల్ సేఫ్ మదర్ హుడ్ డే ను నేడు జరుపుకుంటారు. గర్భధారణ, ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు నివారించేందుకు అవగాహన కల్పించేందుకు ఈ రోజును నిర్వహిస్తారు. తల్లి, బిడ్డల మధ్య గల బంధాన్ని బలోపేతం చేయడంకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భారత ప్రభుత్వం 2003లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

జ్యోతిరావు బా పూలే పుట్టినరోజు

అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన జ్యోతీరావు బా పూలే 1827 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు. బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే.

కస్తూరిబాయి మోహన్ దాస్ గాంధీ పుట్టినరోజు

భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, గాంధీజీ మొదటి భార్య, రాజకీయ కార్యకర్త కస్తూరిబాయి గాంధీ 1869 గుజరాత్ రాష్ట్రం కాఠియావాడ్ ద్వీపకల్పంలోని పోర్ బందర్ లో జన్మించారు. తన భర్త ప్రోత్సాహంతో, కుమారునితో పాటు భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 62 సంవత్సరాల పాటు గాంధీతో కలసి జీవించారు. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నారు.

కుందన్ లాల్ సైగల్ పుట్టినరోజు

ప్రముఖ గాయకుడు, నటుడు కుందన్ లాలా సైగల్ 1904 జమ్ముకాశ్మీర్ రాష్ట్రం జమ్మూలో జన్మించారు. బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడ్డారు. అనేక హిట్ సినిమాలు చేశారు. 15 ఏళ్ల సినీ జీవితంలో 36 సినిమాలలో నటించారు.

జోసెఫ్ కారీ మెరిక్ మరణం

మనిషి- ఏనుగు ఆకారంలో విచిత్రంగా జన్మించిన జోసెఫ్ కారీ మెరిక్ 1890 లండన్ లో మరణించారు. ఈయన 1862 ఆగష్టు 5న ఇంగ్లాండ్ లోని లీసెస్టర్ లో జన్మించారు. ఆయన తీవ్రమైన శారీరక వైకల్యంతో ‘ది ఎలిఫెంట్ మ్యాన్’ అనే స్టేజ్ పేరుతో ఒక ఫ్రీక్ షోలో ప్రదర్శించబడ్డారు. ఆపై సర్ ఫ్రెడరిక్ ట్రైవ్స్ ను కలిసిన తర్వాత లండన్ ఆస్పత్రిలో నివసించడానికి వెళ్లాడు.

పైలా వాసుదేవరావు మరణం

గిరిజన సాయుధ పోరాట యోధుడు, ఉద్యమ నాయకుడు పైలా వాసుదేవరావు 2010 హైదరాబాద్ లో మరణించారు. ఆయన 1932 ఆగష్టు 10న శ్రీకాకుళం జిల్లా బాణాపురం అనే గ్రామంలో జన్మించారు. పెత్తందారీ వ్యవస్థపై తుపాకీని ఎక్కుపెట్టి, గిరజనోద్ధరణకు నడుం బిగించారు. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమాన్ని ప్రారంభించిన ఆదిబట్ల కైలాసం, వెంపటాపు సత్యం వంటి నాయకుల మరణానంతరం నక్సలైట్ల ఉద్యమానికి నాయకత్వాన్ని వహించారు. వాసుదేవరావు తన జీవితంలో సగం అజ్ఞాతంలో గడిపారు.

మరిన్ని విశేషాలు

అంతర్జాతీయంగా కార్మికుల సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థను 1919లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.

భారతదేశంలో మొదటి పేమెంట్ బ్యాంకు ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ను నేడు ప్రారంభించారు. పేమెంట్ బ్యాంక్ సేవల కోసం ఆగస్టు 2015లో అనుమతి లభించిన 11 దరఖాస్తుల్లో ఈ బ్యాంక్ కూడా ఉంది. 2016లో భారతి ఎయిర్‌టెల్ ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం- 1949 పరిధిలోని సెక్షన్ 22 (1) కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button