తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 12

ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 12న నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.

పాలకోడేటి శ్యామలాంబ జననం

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ 1902లో జన్మించారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమం, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈమె కృషి చేశారు.

గోపీచంద్ పుట్టినరోజు

టాలీవుడ్ హీరో గోపీచంద్ 1979లో జన్మించారు. 2001లో ‘తొలివలపు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఆంధ్రుడు, లక్ష్యం, గోలిమార్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మ్యాచో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలాచార్య గజేంద్రగడ్కర్ మరణం

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్రగడ్కర్ 1981లో మరణించారు. 1964 ఫిబ్రవరి 1 నుండి 1966 మార్చి 15 వరకు ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

జలగం వెంగళరావు మరణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి 5వ ముఖ్యమంత్రిగా సేవలందించిన జలగం వెంగళరావు 1999లో మరణించారు. నక్సలైట్ల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన సీఎంగా ఈయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిపొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించారు.

సింగిరెడ్డి నారాయణరెడ్డి మరణం

తెలుగు కవి, సాహితీవేత్త, సినారెగా పేర్గాంచిన సింగిరెడ్డి నారాయణరెడ్డి 2017లో మరణించారు. తెలుగు సాహిత్యానికి ఈయన ఎనలేని కృషిచేశారు. సినారె రాసిన ‘విశ్వంభర’ కావ్యానికి 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button