తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

చరిత్రలో ఈరోజు: జూన్ 7

భాస్కర-1 ప్రయోగం

భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర-1ను 1979లో రష్యాలోని కాపుస్‌యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.

గాంధీజీ మొదటి శాసనోల్లంఘన చర్య

గాంధీజీ 1893లో ఇదే రోజున మొదటి శాసనోల్లంఘన చర్యను చేపట్టారు. జూన్ 7న దక్షిణాఫ్రికాలో రైల్లో మొదటి తరగతి కంపార్ట్‌మెంట్‌లో ఆయన ఎక్కారు. అక్కడి అధికారులు ఆయనపై జాతివివక్ష చూపుతూ కంపార్టుమెంట్ మారాలని చెప్పారు. దానికి ఆయన నిరాకరించారు.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఏటా జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆహార పదార్థాల ప్రమాదాలను గుర్తించడం, నివారించడం దీని ముఖ్య ఉద్దేశం.

బసప్ప దానప్ప జెట్టి వర్ధంతి

భారత తాత్కాలిక రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన బసప్ప దానప్ప జెట్టి 2002లో మరణించారు. 1974 నుండి 1979 వరకు ఈయన భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button