తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ED: హెచ్‌సీఏలో రూ.20కోట్లు గోల్‌మాల్‌.. మాజీ చీఫ్‌‌కు నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ మరోసారి వివాదంలోకి చిక్కుకుంది. తాజాగా హెచ్‌సీఏలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ విచారణ చేపట్టింది. ఈ మేరకు రూ.20 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, కార్యదర్శులను, మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌ను అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఈ అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ చీఫ్‌ వినోద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసుల్లో తెలిపారు.

ALSO READ:  అదంతా తప్పు.. నేను రాజీనామా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై

అక్రమాలపై ఆరోపణలు

ఉప్పల్‌ స్టేడియం నిర్మాణ సమయంలో అక్రమాలు చోటుసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదయింది. ఎఫ్‌ఎఆర్‌, అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్‌ ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ నెల 29న వినోద్‌ కూడా విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button