తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Electra Stumps: క్రికెట్‌లో కొత్త స్టంప్స్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

క్రికెట్‌ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలతోపాటు మార్పులు తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్​తో పాటు బీసీసీఐ, ఎంసీసీ లాంటివి ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల డీఆర్ఎస్‌తోపాటు ఐపీఎల్ వంటి లీగ్ క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనలతో ఇంట్రెస్టింగ్​గా మార్చేందుకు ప్రయత్నించారు. తాజాగా మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడియెన్స్​కు, ఫ్యాన్స్​కు న్యూ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చేందుకు కొత్త‌ర‌కం టెక్నాల‌జీ వాడుతున్నారు. ఇందులో భాగంగానే రంగులొలికే ఎల‌క్ట్రా స్టంప్స్‌ను ప్ర‌వేశ పెట్టారు.

ALSO READ: టీమిండియాకు భారీ షాక్.. జట్టుకు దూరం కానున్న కీలక ప్లేయర్?

బీబీఎల్​లో సరికొత్త స్టంప్స్

బిగ్​బాష్ లీగ్​లో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్టంప్స్.. ఇంటర్నేషనల్ క్రికెట్​లో వాడుతున్న వికెట్ల మాదిరిగానే ఉన్నాయి. అయితే లైటింగ్ విషయంలో ఇవి కాస్త స్పెషల్. బెయిల్స్ నుంచి వికెట్ల కింద వరకు మొత్తం ఎల్​ఈడీ లైట్లతో నింపేశారు. అయితే సాధారణంగా ప్రస్తుత క్రికెట్​లో వాడుతున్న వికెట్లు ఔట్, స్టంపౌట్, రనౌట్ అయినప్పుడు మాత్రమే రెడ్ కలర్‌లో లైట్లు వెలుగుతాయి. కానీ బీబీఎల్​లో ప్రవేశపెట్టిన స్టంప్స్​లో ఐదుసార్లు లైట్స్ వస్తాయి. ఎవరైనా ఔట్ అయినప్పుడు రెడ్ కలర్​లో, బౌండరీలకు (కలర్ షిఫ్ట్), సిక్సులు (కలర్ స్క్రోలింగ్), నో బాల్ (రెడ్, వైట్ కలర్), ఓవర్ల మధ్యలో (పర్పుల్, బ్లూ కలర్) వివిధ రంగుల్లో లైట్స్ వెలుగుతాయి. వీటిని తొలిసారిగా సిడ్నీ సిక్స‌ర్స్, అడిలైడ్ స్ట్ర‌యిక‌ర్స్ మ్యాచ్‌లో ఉప‌యోగించారు. ప్రస్తుతం కొత్త స్టంప్స్​కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button