తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Arulnithi: భయపెడుతున్న ‘డెమోంటే కాలనీ 2’ ట్రైలర్

కోలీవుడ్ నుంచే వ‌చ్చే హారర్ చిత్రాల‌కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదే జాన‌ర్‌లో త‌మిళంలో వ‌చ్చిన మ‌రో చిత్రం ‘డెమోంటే కాలనీ’. న‌టుడు అరుల్ నిధి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2015లో చిన్న సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది.

Also Read: నా సామి రంగ టీజర్… యాక్షన్ మూడ్ లో నాగార్జున

‘డెమోంటే కాలనీ 2′ అంటూ ఈ సీక్వెల్ రానుండ‌గా ఈ చిత్రంలో అరుల్ నీతి హీరోగా నటిస్తుండగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Also Read: ఓటిటిలోకి వచ్చేస్తున్న ఆదికేశవ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక మొద‌టి పార్ట్ కథ ఒక బంగ్లాలో చిక్కుకున్న నలుగురు తాగుబోతు స్నేహితులు.. అక్కడ వారు అనుభవించే భయాందోళనలు మ‌ధ్య జ‌రుగగా.. సెకండ్ పార్ట్ అక్కడ నుంచే మొద‌ల‌వుతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ మ‌రింత హారర్‌గా ఉండ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button