తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Indian 2: భారతీయుడు 2 సెన్సార్ పూర్తి.. మూవీ రన్ టైం ఎంతంటే?

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. కొన్ని సూచనలు ఇస్తూ సెన్సార్‌ బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ‘భారతీయుడు 2’ రన్‌టైమ్‌ ఏకంగా 3.04 గంటలు ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్‌ బోర్డ్‌ మూవీ టీంకు సూచించింది. ఇంత నిడివి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, కథనాలు ఉండాలి. అయితే శంకర్‌ ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మూవీలో అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.

Read also: Vishwambhara: మెగాస్టార్ విశ్వంభర అప్డేట్.. మూవీ డబ్బింగ్ షురూ

ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మూడు గంటలకు పైగా రన్‌టైమ్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి జాబితాలో కమల్‌ హాసన్ ‘భారతీయుడు 2’ చేరింది. ఆ సినిమాలన్నీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే ‘భారతీయుడు 2’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయమని సినీప్రియులు అభిప్రాయపడుతున్నారు.‘భారతీయుడు’ 1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది. సేనాపతి పాత్రలో కమల్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button