తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Indian-2 Movie: ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్‌ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్ ‌చేశాడు. 2018లోనే ఈ మూవీ షూటింగ్ మొదలైనా.. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం, నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్‌ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు . దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి 2024 కొత్త ఏడాది తొలిరోజున మోక్షం కలిగింది. ఎట్టకేలకు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను పూర్తిచేశాడు.

Also read: Journey Movie: త్వరలో జర్నీ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్‌ తో ఇండియన్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమా యూనిట్‌తో కమల్‌హాసన్ ఓ ఫొటోను దిగారు. కమల్‌హాసన్‌తో పాటు శంకర్ కెరీర్‌లో ఎక్కువ కాలం షూటింగ్‌ ను జరుపుకున్న మూవీగా ఇండియన్ 2 నిలిచింది. ఇండియన్ -2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సిద్ధార్థ్‌ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఇండియన్ 2 మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇండియన్ 2 సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన కమ్ బ్యాక్ ఇండియన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇండియన్ 2 సినిమాను దర్శకుడు శంకర్ ఎంతో రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. అదిరిపోయే విజువల్స్ తో ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా ఉండనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button