తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: కేసీఆర్ ఓటమి జగన్ కు పాఠం కానుందా?… ఆంధ్ర ఎన్నికల్లో ఆయన ప్లాన్ ఏంటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా 119 సీట్లకుగాను 63 స్థానాలను గెలుచుకొని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018 లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 88 సీట్లు సాధించి గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 19 సీట్లకే పరిమితమైంది. ఇక 2023 ఎన్నికల విషయానికి వస్తే బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 64 నియోజకవర్గాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read:  డిసెంబర్ 17 న నాలుగు పరీక్షలు… గందరగోళంలో అభ్యర్థులు

కేసీఆర్ చేసిన తప్పు ఇదేనా?

అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూడడానికి ముఖ్య కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే అని తెలుస్తుంది. ప్రజల్లో వారికి ఆదరాభిమానాలు లేవని సర్వేలు చెప్పిన కానీ వినకుండా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అవకాశం కల్పించాడు. ప్రజలకు తన పై నమ్మకం ఉందనో లేక తను ఎవరిని నిలబెట్టిన ప్రజలు గెలిపిస్తారని విపరీతమైన కాన్ఫిండెన్స్ తోనో తెలియదు కానీ చాలా చోట్ల అభ్యర్థులను మార్చకుండానే ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ప్రజల్లో వారి పట్ల వ్యతిరేకత ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడించారు. అభ్యర్ధులను మార్చిన చోట కేసీఆర్ కు మంచి ఫలితాలు కనిపించాయి.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం… వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు

కేసీఆర్ చేసినా తప్పులు చేయకూడదని భావిస్తున్న జగన్

ఇదిలా ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 2024 లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాలకు గాను 151 సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పటికే 2024 ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు,సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఓటమిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన తప్పులను జగన్ చేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం.. కాసేపట్లో నిధులు విడుదల

ఆర్కే అందుకే దూరమయ్యారా?

వివిధ సర్వేల ద్వారా సీఎం జగన్ కి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పై ప్రజల్లో వ్యతిరేకత లేదని తెలుస్తుందట. కానీ కొన్ని ప్రాంతాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అది పార్టీకి తల నొప్పిగా మారకుండా జాగ్రత్త పడాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రజల్లో ఎవరికైతే మంచి నాయకుడిగా పేరుందో వారినే ఈసారి ఎన్నికల్లో నిలబెట్టి మిగితా వారిని పక్కన పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యేని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button