తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: చంద్రబాబు చేసిన లీక్స్‌..టీడీపీలో అసమ్మతి సెగ!

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎంపికలో వైసీపీ దూసుకెళ్తుండగా.. టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తుది జాబితా వెలువడే లోపు ఎవరుంటారో.. ఎవరు గోడ దూకుతారో? తెలియక తికమక చెందుతున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లీక్స్‌తో టీడీపీలో అసమ్మతి సెగ మొదలైంది.

ALSO READ: నేడు బాపట్ల జిల్లాలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ

తెలుగు తమ్ముళ్లకు షాక్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు కూడా పొత్తు స్థానాల ఇన్‌ఛార్జ్‌లకు కూడా టికెట్ నిరాకరించినట్లు సమాచారం. పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్‌ చేయడంతో పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఆ పార్టీ యకులకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ బొరగం శ్రీనివాస్‌కు సీటు కేటాయించాలని నాయకులు తీర్మానించారు.

ALSO READ: ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

మూకుమ్మడి రాజీనామాలు!

జనసేనతో పొత్తు విషయంలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లకు సీటు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక ఉంగుటూరులో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకి సీటు కేటాయించాలని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పారు. కాగా, ఏ సీట్లు ఎవరికి కేటాయించారో అనే విషయం తేల్చకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button