తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas: పృథ్వీరాజ్‌పై ప్రభాస్ ప్రశంసలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్ తర్వాత బాగా గుర్తింపు పొందిన నటుడు పృథ్వీరాజ్. వరద రాజమన్నార్‌ పాత్రలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసంలు అందుకున్నారు. ఈ సినిమాతో పృథ్వీరాజ్ పాన్ ఇండియా యాక్టర్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బ్లెస్సీ దర్శకత్వంలో తాజాగా పృథ్వీరాజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’. గోట్‌ డేస్‌ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ కథానాయిక. మార్చి 28న తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ALSO READ: మిస్ వర్డల్-2024 పోటీలు…కిరీటం దక్కించుకున్న క్రిస్టీనా

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం ఈ మూవీ ట్రైలర్‌పై స్పందించారు. పృథ్వీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ నేను చూస్తుంది వరదరాజ మన్నార్‌గా నటించిన వ్యక్తినా! ఇది నేను నమ్మలేకపోతున్నా. పృథ్వీ మీరు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. మంచి విజయం సాధిస్తుంది. మీకు అభినందనలు’ అని తెలిపారు. కాగా.. గతంలో ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని ప్రభాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button