తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: బీసీలకు టీడీపీ అరకొరగా సీట్లు.. ఇదేం సామాజిక న్యాయం?

సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాగేసుకున్నప్పటి నుంచి పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. టీడీపీ బీసీలది అని, బడుగు, బలహీన వర్గాల కోసమే టీడీపీ పుట్టిందని పదే పదే ఊదరగొట్టే చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపిక, ఇతర పదవుల పంపకాల్లో బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోందనే విషయం మరోసారి బయటపడింది. టికెట్ల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలకు మొండిచెయ్యి చూపింది.

ALSO READ: ‘నా బలం, నా బలగం వాళ్లే’.. ఎవరూ సాహసించని అరుదైన ఘట్టం!

బీసీలకు వెన్నుపోటు..

రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇప్పటివరకు రెండు విడతలుగా 128 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓసీలకు 72 సీట్లు కేటాయించగా..బీసీలకు 24 సీట్లు ఇచ్చి సరిపెట్టింది. ఇందులో మొదటి జాబితాలో 18, రెండో జాబితాలో 6 సీట్లను ఇచ్చారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు 25, ఎస్టీలకు 4 సీట్లను కేటాయించారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు.. ఈసారి సగానికి సగం తగ్గించి నిరాశ పరిచారు.

ALSO READ: మోగిన ఎన్నికల నగరా.. వృద్ధులకు ఇంటి వద్దే ఓటు!

వైసీపీ.. అదనంగా సీట్ల కేటాయింపు

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు వైసీపీ అత్యధికంగా సీట్లు కేటాయించింది. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. గతంలో కంటే ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అదనంగా 11 సీట్లు కేటాయించారు. 2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు ఇవ్వగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయించారు.

సంబంధిత కథనాలు

Back to top button