తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: పేద విద్యార్థులకు గుడ్ న్యూస్… జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం

జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్స్ పురస్కారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ నిధులను విడుదల చేశారు. మంచి యూనివర్సిటీల్లో సీటు పోందితే ఫీజు ఎంతయినా ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారు. జగనన్న విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 51 మందికి అడ్మిషన్ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు 41.59 కోట్లు ఫీజులు ఇప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన ఈ సహయాన్ని మర్చిపోకుండా తిరిగి రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేయాలని కోరారు. 408 మందికి నేడు ప్రభుత్వం సాయం అందిస్తుందని స్పష్టంచేశారు.

Also Read: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల.. అప్పు ఎంత ఉందంటే?

ఫీజు మొత్తం మేమే భరిస్తాం

తల్లిదండ్రులు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు. జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నామని తెలిపారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్ లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తుమని హామీ ఇచ్చారు. 8 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు.

Also Read: 50 ఏళ్ల వ్యక్తి గుండెను 11 ఏళ్ల చిన్నారికి అమర్చిన వైద్యులు

ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు

ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని యువత కలలు కంటుందని.. దీనికి కూడా మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు.. మెయిన్స్‌కు వెళితే లక్షన్నర ఇస్తున్నామన్నారు. 95 మందికి సివిల్స్ ప్రోత్సాహకం ప్రిలిమ్స్ కింద లక్షరూపాయలు, 11 మంది మెయిన్స్ క్లియర్ చేసిన వారికి లక్షన్నర అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీలకు విద్యార్ధులను పంపించారన్నారు. అందుకే స్కీముల లో మార్పులు చేర్పులు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button