తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

EAGLE Trailer: ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు: ఆసక్తిగా ఈగల్‌ ట్రైలర్‌

టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈగల్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.

Also Read: సింగర్ సునీత తనయుడు హీరోగా మూవీ… ‘సర్కారు నౌకరి’ ట్రైలర్ రిలీజ్

తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు అని నవదీప్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ రవితేజ మార్క్‌ డైలాగ్స్‌ తో సాగుతున్న ట్రైలర్‌.. సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button