తెలుగు
te తెలుగు en English
జాతీయం

I.N.D.I.A: లోక్ సభ ఎన్నికల వేళ…. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంచనా వేశారు. అయితే మిత్రపక్షాలు తమ మద్దతుపై పునరాలోచించుకునే స్థాయికి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో బహుశా ప్రతిపక్షంతో జతకట్టాల్సి రావొచ్చని శశిథరూర్ విశ్లేషించారు. కేరళలో ‘లిటరేచర్ ఫెస్టివల్ సెషన్‌’లో ‘ఇండియా – ది ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే అంశంపై మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: రామమందిర ప్రారంభానికి పోవద్దని ప్రజలకు తాము ఎప్పుడు చెప్పలేదు: పొన్నం

భారతదేశ వైవిధ్యం, అన్నీ రాష్ట్రాలలో ఏకగ్రీవ అవగాహన ఒప్పందాలను సాధించడంలో ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురవుతున్న సవాళ్లపై ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోని అన్ని ప్రతిపక్ష పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఒప్పందం సాధ్యం కాకపోయినప్పటికీ బీజేపీ సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయేలా ప్రయత్నించాలని ఆయన అన్నారు. ప్రతి పక్షాలతో జట్టు కట్టే స్థాయికి బీజేపీని తీసుకురావాలన్నారు. ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకం విషయం సంక్లిష్టంగా మారడంపై స్పందిస్తూ.. కూటమిలో పార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇందుకు కారణమని అన్నారు. గెలుపు అవకాశాలున్న చోట్ల ఓటముల నుంచి గట్టెక్కెలా తగిన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button