తెలుగు
te తెలుగు en English
జాతీయం

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ రికార్డు… ఐదోసారి విజయం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. ఐదోసారి ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 230 స్థానాలకు గాను 166 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 63 స్థానాలకే పరిమితమైంది. 2003 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ స‌ర్కారును న‌డిపిస్తోంది. అయితే 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించినా.. 2020లో జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల క‌మ‌ల్‌నాథ్ స‌ర్కారు కూలిపోయింది.

Also Read: తెలంగాణలో ప్రభావం చూపించని పవన్… డిపాజిట్లు గల్లంతు

జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు చేయ‌డంతో.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. బీజేపీతో సింథియా చేర‌డంతో.. ఆ పార్టీ స‌ర్కారును ఏర్పాటు చేసింది. అయితే 2003 నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న కార‌ణంగా.. ఆ పార్టీ వ‌రుస‌గా అయిదోసారి రాష్ట్రాన్ని చేజిక్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button