తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS: బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఒక్కో నేత వరుసగా పార్టీ మారుతున్నారు. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ కీలక నేత ఆరూరి రమేశ్ రాజీనామా చేయగా, ఇవాళ బీజేపీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ALSO READ: బీసీలకు టీడీపీ అరకొరగా సీట్లు.. ఇదేం సామాజిక న్యాయం?

చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి కేసీఆర్ తొలుత రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంటనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఇటీవలనే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత దానం నాగేందర్ పార్టీ మారుతున్నారన ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కానీ ఇవాళ అనూహ్యంగా దానం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button