తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.

ALSO READ: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగా జిల్లాలో పలు అభివృద్ధి పను­లకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఇందులో రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button