తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మాజీ సీఎం ఫొటో.. బయటపడిన అధికారుల నిర్లక్ష్యం!

తెలంగాణలో ప్రభుత్వం మారి దాదాపు రెండు నెలలు పూర్తవుతోంది. కానీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఇప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగా.. మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతోపాటు విద్యా‌శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాలకులు మారినా.. పాలసీలు మారినా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రం గత పాలకులే దర్శనమివ్వం అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు… వారం రోజుల్లో రూ. 500లకే గ్యాస్ సిలిండర్

అధికారుల నిర్లక్ష్యమే!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. అయినా ఇప్పటికీ పలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో గత ప్రభుత్వ మంత్రుల ఫోటోలు కనిపించడం.. ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button