తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sri Vishnu: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటున్న శ్రీవిష్ణు… ‘ఓం భీమ్ బుష్’ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్‌ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

Also Read: దెయ్యం కాన్సెప్ట్ మూవీ… వినూత్నంగా స్మశానంలో టీజర్ లాంచ్

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ముగ్గురు ఏలియన్స్ భూమి మీదకు దిగినట్టు ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఓం భీమ్ బుష్’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా టైటిల్ కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

Also Read: గోపిచంద్ ‘భీమా’ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు.ఇక ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రాచ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక బృందం విషయానికి వస్తే, రాజ్ తోట సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సన్నీ MR సంగీతం అందించనున్నారు. ఓం భీమ్ బుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మార్చి 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button