తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 21శాతం ఫిట్ మెంట్‌తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడనుంది.

ALSO READ: ఏ పార్టీతో పొత్తు లేదు.. ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మాయావతి

హామీ ఇచ్చిన రెండ్రోజుల్లోనే..

హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో ఇటీవల 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button