తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయనం.. 4నెలల డెడ్ లైన్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉన్నారు. నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ రిపోర్టు సమర్పించనుంది. ఈ మేరకు మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనుంది.

ALSO READ:  సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. హస్తం గూటికి చేరనున్నారా?

3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసి సామర్థ్యం గల రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకి నీటిని ఎత్తిపోయడం లాంటి సంక్లిష్టమైన అంశాలున్న ఎత్తిపోతల ప్రాజెక్టు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసినట్లు మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల బొందల గడ్డకు వెళ్తున్నరా.. ఏ మొఖం పెట్టుకొని వెళ్తున్నరు అని కేసీఆర్ వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డను సందర్శించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button