తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Film stars in Politics: రాజకీయ పార్టీలు పెట్టిన సినీ తారలు వీరే?

సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మొదటి నుంచి వస్తోంది. మరి ముఖ్యంగా తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో చాలా మంది సినీ తారలు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు ఉన్నారు. తమిళంలో అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకు.. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ వరకు పార్టీలు పెట్టినవారే. అయితే దక్షిణ భారత్‌లో తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో సినీకళాకారులు రాజకీయ పార్టీలు పెట్టింది తెలుగు సినీ ప్రముఖులే.

సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువ..

సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇందులో కొంతమంది సక్సెస్ అవుతుండగా.. మరికొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. అయితే నార్త్ ఇండస్ట్రీ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా విజయం సాధించారు. కాగా, సినీ పరిశ్రమలో మెప్పించిన అమితాబచ్చన్‌, చిరంజీవి, విజయకాంత్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, శివాజీ గణేషన్‌లు రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దీంతో కొంతమంది పూర్తిగా రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు.

రాజకీయ పార్టీలు ఇవే!

సీనియర్ ఎన్టీఆర్ – తెలుగుదేశం పార్టీ

మెగాస్టార్ చిరంజీవి – ప్రజారాజ్యం పార్టీ

విజయశాంతి – తల్లి తెలంగాణ

పవన్ కల్యాణ్ – జనసేన

శివాజీ గణేషన్‌, ఉదయ్ నిధి స్టాలిన్ – డీఎంకే

కెప్టెన్ విజయ్ కాంత్‌ – డీఎండీకే

ఎంజీ రామచంద్రన్, జయలలిత – అన్నాడీఎంకే

కమల్ హాసన్ – మక్కల్ నీది మయ్యమ్(ప్రజా న్యాయ వేదిక)

విజయ్ – తమిళగ వెట్రి కళగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button