తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Plane: ఆఫ్గాన్ లో కూలిన భారత్ విమానం.. ప్రకటించిన అధికారులు

మాస్కోకు వెళుతున్న భారత విమానం శనివారం బదక్షన్‌లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయిందని ఆఫ్గనిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బదక్షన్‌లోని తాలిబాన్ సమాచార, సంస్కృతి చీఫ్ సైతం ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రావిన్స్‌లోని కరణ్, మంజన్, జిబాక్ జిల్లాలను కవర్ చేసే తోప్‌ఖానే పర్వతంలో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని వెల్లడించారు.

Also read: Constable: పురుషుడిగా మారి.. ఆపై తండ్రయ్యాడు

ఘటనపై విచారణకుగాను ఆ ప్రాంతానికి బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం, ప్రమాదానికి గల కారణాల గురించిన సమాచారాన్ని మాత్రం ఇప్పటి వరకు అధికారిక వర్గాలు అందించలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం విమానాలు బయల్దేరు సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని తేలింది. ప్రమాదానికి గురైన విమానం చార్టర్డ్ విమానం అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button