తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: ‘హ‌నుమాన్’ సినిమాపై బంఫ‌ర్ ఆఫ‌ర్.. బై వన్‌.. గెట్‌ వన్ ఫ్రీ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హనుమాన్’. చిన్న సినిమాగా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకోవడంతోపాటు మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా, ఈ సినిమా యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ALSO READ: ఓటిటిలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఇంత త్వరగానా?

ఆఫర్ ఏంటంటే?

అయోధ్యలో నిర్మించిన రామ‌మందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సంద‌ర్భంగా హ‌నుమాన్ సినిమాపై మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనవరి 22న ఈ సినిమాకు ‘బై వన్‌.. గెట్‌ వన్’ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇందులో ‘MIRAJBOGO’ అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫ‌ర్ ఒక్కరోజు మాత్రమే అని తెలిపింది. కాగా, ఈ సినిమా తొమ్మిది రోజుల్లో తెలుగులో రూ.73 కోట్లు, దేశ వ్యాప్తంగా రూ.114 కోట్లు నికరంగా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో రూ. 42 కోట్లు కలిపితే ఈ సినిమా రూ.172 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button