తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్ మూవీ టీం… విరాళం ఎంత ఇచ్చిందో తెలుసా?

సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న హనుమాన్ మూవీ రిలీజై భారీ విజయం సాధించింది. సినిమా రిలీజ్ రోజు ముందు ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ దూసుకుపోతుంది. ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

Also Read: ‘హ‌నుమాన్’ సినిమాపై బంఫ‌ర్ ఆఫ‌ర్.. బై వన్‌.. గెట్‌ వన్ ఫ్రీ

ఈ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించిన చిత్రబృందం అనుకున్నట్టే ఇప్పటి వరకు వచ్చిన 2,66,41,055 ను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి 5 రూపాయల చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది.

Also Read: ఓటిటిలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఇంత త్వరగానా?

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘కోటి’ అనే వానరానికి ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button