తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Janasena: ‘జనసేన’ రాజకీయ ప్రయాణం ముగింపు.. త్వరలో బీజేపీలో విలీనం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జనసేన పార్టీ కనుమరుగు కానుందా? బీజేపీలో ఆ పార్టీ విలీనం కాక తప్పదా? తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి కూడా పడుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీల కోసం చేస్తున్న త్యాగాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు వేసే ముష్టి 21 సీట్లకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తే వైసీపీ విమర్శిస్తున్నట్టుగా ఆయనను ‘ప్యాకేజీ స్టార్’ అనడంలోనూ ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

ALSO READ: చంద్రబాబు పొలిటికల్‌ మాస్టర్‌ ప్లాన్‌..గందరగోళంలో పవన్‌‌!

ఎన్నికల తర్వాత విలీనం

అంతేకాదు, అంతర్గత వర్గాల సమాచారం మేరకు 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి పవన్ కళ్యాణ్ ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి పవన్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన అక్కడ ఎంపీగా ఓడిపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపిస్తుందని, ఈ నేపథ్యంలోనే జనసేనను పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ALSO READ: ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం: ఏపీఈఆర్సీ

21 కన్నా ఇంకా తగ్గొచ్చు!

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్ మరో అడుగు వెనక్కి వేసిన విషయం తెలిసిందే. ఇదివరకు తమ పార్టీకి కేటాయించిన 24 సీట్ల నుంచి మరో మూడు సీట్లు వదులుకున్నారు. తాజా లెక్కల ప్రకారం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా, టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అంతేకాదు, జ‌న‌సేన‌కు ఇప్పుడు ప్ర‌క‌టించిన 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ స్థానాలు కూడా ఖాయ‌మైన‌ట్టు కాదట. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల రీత్యా నామినేష‌న్ల చివ‌రి రోజు వ‌ర‌కూ మార్పుచేర్పులు చేయొచ్చట. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌ త‌న సీట్ల‌లో మరింత కోత విధించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

10 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button