తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జనవరి 18: చరిత్రలో ఈరోజు

ఎన్టీఆర్ వర్ధంతి (18 జనవరి 1996)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. నిమ్మకూరులో జన్మంచి విశ్వవిఖ్యాత నటుడిగా.. తెలుగు ఆత్మగౌరవ ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారు. 300కు పైగా సినిమాలు చేసి అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్టీఆర్ 18 జనవరి 1996న తుదిశ్వాస విడిచారు. పౌరాణిక చిత్రాలతోపాటు సాంఘిక సినిమాలు చేసి ప్రజలను జాగరూకత చేశారు. టీడీపీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీఆర్ పాలనలోనూ ప్రజలందరి మన్ననలు పొందారు. జీవితంలో జరిగిన కొందరి వలన ఆయన చివరి రోజుల్లో దుర్భర జీవితం అనుభవించారు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పటికీ తెలుగువారు మరచిపోరు.

చదవండి: జనవరి 17 చరిత్రలో ఈరోజు

భారత పార్లమెంట్ భవనం ప్రారంభం (18 జనవరి 1927)
ఇటీవల ప్రారంభమైన కొత్త పార్లమెంట్ భవనం కన్నా ముందు పాత పార్లమెంట్ భవనం 1927లో నేడే ప్రారంభమైంది. లోక్ సభ, రాజ్యసభ రెండూ కలిపి అత్యంత విశాలంగా పటిష్టమైన భవనం ఉంది. భారత చరిత్రలో ఈ పార్లమెంట్ భవనానికి విశిష్ట చరిత్ర ఉంది. కానీ అలాంటి భవనం ప్రస్తుతం నిర్వీర్యంగా మారింది. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో పాత భవనంలో ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు.

Also Read జనవరి 16 చరిత్రలో ఈరోజు

యాహు ప్రారంభం (18 జనవరి 1995)
ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ యాహు డాట్ కామ్ 1995లో ఇదే రోజున ప్రారంభమైంది. గూగుల్ మాదిరి యాహు ప్రారంభమవగా.. వచ్చిన కొత్తలో యాహుకు విశేష ఆదరణ లభించింది. మారిన పరిస్థితుల కారణంగా యాహూ హవా తగ్గుతోంది.

తొలి విద్యుత్ కారు (18 జనవరి 1997)
దేశంలో తొలి విద్యుత్ కారు ‘రెవా’ 1997లో ఇదే రోజున ప్రారంభమైంది. భారత్ లో తొలి విద్యుత్ కారు ‘రెవా’ నేడే బెంగళూరులో ప్రారంభమైంది.

మరికొన్ని విశేషాలు

  • కెనడాలో నేడు ధూమపాన రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ఐదు నదీ ప్రాంతాలతో కలిసి ఉన్న మిచిగాన్ లో ఈరోజు జాతీయ మిచిగాన్ డేగా పరిగణిస్తారు.
  • ఐదు నదీ ప్రాంతాలతో కలిసి ఉన్న మిచిగాన్ లో ఈరోజు జాతీయ మిచిగాన్ డేగా పరిగణిస్తారు. మిగిచాన్, హరూన్, ఎరీ, ఒంటారియో, సూపిరియర్ అనే సరస్సులతో మిచిగాన్ కూడి ఉంటుంది.
  • ఎర్ర చందనం స్మగ్లర్ జయంతి ఈరోజు (1952).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button