తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 30: చరిత్రలో ఈరోజు

ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా నిర్వహిస్తారు. 2015లో చెన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీనిని గుర్తించాడు. మార్చి 30న ఇడ్లీ దినోత్సవం సందర్భంగా 1328 రకాల ఇడ్లీలను తయారుచేసి.. ఇడ్లీ ప్రత్యేకత, ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటాడు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. క్రీస్తు శకం 800-1200 లో భారత్ లోకి వచ్చింది. ఇడ్లీని ఇండియన్ ఫుడ్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

దేవికా రాణి పుట్టినరోజు

సుప్రసిద్ధ భారతీయ నటి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికా రాణి 1908లో విశాఖపట్నంలో జన్మించారు. జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాత హిమాంశు రాయ్ ను 1929లో పెళ్లాడారు. 1933లో కర్మ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో దేవికా రాణి, హిమాంశు రాయ్ హీరోహీరోయిన్లుగా హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది. తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. 1958లో పద్మశ్రీ, 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించాయి.

కేఎస్ తిమ్మయ్య పుట్టినరోజు

జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య భారత సైన్యంలో ఒక విశిష్టమైన సైనికుడు. ఈయన 1906 కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా మద్దికెరి గ్రామంలో జన్మించారు. 1957 నుండి 1961 వరకు భారత చైనా దేశాలమధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో భారత సైన్యంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించారు. రెండో ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. కొరియా యుద్ధం తరువాత యుద్ధ ఖైదీలను వారి వారి దేశాలకు తిరిగి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి విభాగానికి నాయకత్వం వహించారు. ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత 1964 జూలై నుండి డిసెంబరు 1965 వరకు సైప్రస్ దేశంలో ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్‌గా నియమించబడ్డారు.

నగేష్ కుకునూర్ పుట్టినరోజు

హిందీ చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు నగేష్ కుకునూర్ 1967 హైదరాబాద్ లో జన్మించారు. సినిమా రంగంపై ఆసక్తితో హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లి అక్కడే స్థిర పడ్డాడు. భారత్ కు తిరిగివచ్చి హైదరాబాద్ బ్లూస్ అనే ఇంగ్లీష్ మూవీ తీశాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించి నగేష్ కు పేరు తెచ్చింది. హిందీలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అభిమానుల మన్ననలు పొందారు.

నితిన్ పుట్టినరోజు

టాలీవుడ్ హీరో నితిన్ కుమార్ రెడ్డి 1983 నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. దిల్, సై, ఇష్క్, గుండెజారి గుల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు.

నూతన ప్రసాద్ మరణం

తెలుగు సినిమాలో హస్యనటుడు, ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకున్న నూతన్ ప్రసాద్ 2011లో హైదరాబాద్ లో మరణించారు. ఈయన అసలు పేరు తడినాధ వరప్రసాద్. నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన ఈయన 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. 1973లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కొన్ని వందల చిత్రాల్లో నటించి పలు పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

సురభి కమలాబాయి మరణం

తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని సురభి కమలాబాయి 1971లో మరణించారు. ఈమె 1907 లో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించారు. 1931లో తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద చిత్రంలో లీలావతి పాత్రను చేశారు. పలు ఆధ్యాత్మిక, పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఆనంద్ బక్షి మరణం

ప్రసిద్ధ హిందీ సినీ కవి, రచయిత ఆనంద్ బక్షి 2002 లో ముంబైలో మరణించారు. ఈయన 1920 జూలై 21న ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించారు. ఈయన జీవితమంతా ముంబైలోనే గడిచింది. దాదాపు 638 సినిమాల్లో 3500 పైగా పాటలు రాశారు. 1972 లో వచ్చిన హరేరామ హరేకృష్ణ మూవీలోని దమ్ మారో దమ్ అనే ఇప్పటికీ ఫేమస్. ఈయన ప్రతిభకు ఎన్నో పురస్కారాలు దక్కాయి.

మరికొన్ని విశేషాలు:

అమెరికన్ శస్త్రవైద్యులు 1842లో ఈథర్ మొదటిసారిగా మత్తుమందుకు ఉపయోగించారు.

అలస్కా ప్రాంతాన్ని 1867లో రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.

భారత్- ఇంగ్లాండ్ మధ్య 1929లో విమాన సేవలు మొదలయ్యాయి.

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు 2023 లో మరణించారు.

8 Comments

  1. Hmm it seems like your website ate my first comment (it was extremely long) so I
    guess I’ll just sum it up what I had written and say, I’m thoroughly enjoying your blog.
    I too am an aspiring blog writer but I’m still new to the whole thing.
    Do you have any helpful hints for rookie blog writers?
    I’d certainly appreciate it.

    Visit my site … vpn coupon code 2024

  2. Wonderful goods from you, man. I have understand your stuff previous
    to and you are just extremely wonderful. I really like what
    you have acquired here, really like what you’re stating and the way in which you say it.
    You make it entertaining and you still take care of to keep it
    wise. I cant wait to read far more from you.
    This is actually a wonderful website.

    Here is my web site eharmony special coupon code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button