తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు..చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా?

రానున్న ఎన్నికలు పిల్లల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు సభలో ప్రజలను ఉద్ధేశించి సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. చంద్రబాబు శింగనమలలో వైసీపీ ఓ టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ బాబు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్‌ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్‌ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్‌ డ్రైవర్‌గా తన కాళ్లపై నిలబడ్డాడు. మాది పేదల పార్టీ.. అందుకే టికెట్ ఇచ్చామని జగన్ అన్నారు.

ALSO READ: జగన్ బస్సుయాత్రతో కూటమిలో వణుకు!

రక్షాబంధన్‌ కట్టాలి..

వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50శాతం నామినేటెడ్‌ పదవులు ఇచ్చామన్నారు. ఈ పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలని కోరారు. అదే విధంగా బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? అన్నారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు బాగుపడ్డాయని, పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయన్నారు. మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని కోరారు.

ALSO READ: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

రైతు బాగుంటేనే..

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మినట్లు జగన్ అన్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతుకు అందించామన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పగటి పూటే నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని, విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయన్నారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్‌ వచ్చేదని, రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా? అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button