![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/rains.jpg)
ప్రత్యేక కథనం
Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం 7 జిల్లాలు, సోమవారం మరో 3 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also read: PM Modi: రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం శ్రీకారం.. రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జల్లులకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.