తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Winter: తెలంగాణను వణికిస్తున్న చలి.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. మొత్తంగా 30 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ ​లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు చలి తీవ్రతపై ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తక్కువగానే (30 నుంచి 33 డిగ్రీల మధ్య) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Also read: హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం సమీక్ష.. మూసీ ప్రక్షాళనపై దృష్టి

మరోవైపు హైదరాబాద్​లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్, పటాన్​ చెరు, హయత్​ నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా రాజేంద్రనగర్​లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ 18 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్ 10.8 డిగ్రీలు, ఆదిలాబాద్ 11.1, రంగారెడ్డి 11.2, సంగారెడ్డి 11.3, వికారాబాద్ 11.6, మహబూబ్ ​నగర్ 12, సిద్దిపేట 12.4, యాదాద్రి 12.4, నిర్మల్ 12.5, కామారెడ్డి 12.5, సిరిసిల్ల 12.6, మంచిర్యాల 12.6, నిజామాబాద్ 12.8, జగిత్యాల 12.8, జనగామ 12.9, నల్గొండ 13, వరంగల్13.1, భూపాలపల్లి 13.1, మేడ్చల్ 13.2, మెదక్ 13.2, హనుమకొండ 13.2, పెద్దపల్లి 13.4, ములుగు 13.4, కరీంనగర్ 13.6, నారాయణపేట 13.8, మహబూబాబాద్ 13.8, నాగర్ ​కర్నూల్ 14, గద్వాల 14.3, హైదరాబాద్ 14.8, ఖమ్మం 15.2, సూర్యాపేట 15.5, వనపర్తి 15.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button