తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs AUS: ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేతలను ఎలా నిర్ణయిస్తారు..?

వరల్డ్ కప్ 2023 తుది సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ తుదిపోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మ్యాచ్‌ జరిగే సమయంలో తేలకపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే వరల్డ్ కప్ 2023 విజేతను ఎలా నిర్ణయిస్తారు..? ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందో..? తెలుసుకుందాం.

ఇరు జట్ల స్కోర్ సమమైతే..

వరల్డ్ కప్ 2023లో ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు వరల్డ్ కప్ 2023 ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ జరగాల్సిన రోజు వర్షంతో ఆటంకం కలిగితే.. మరుసటి రోజు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌‌కు అదనంగా రిజర్వ్ డే సదుపాయం కల్పించారు. ఒకవేళ ఆ రోజు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్ సమమైతే సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఓవర్‌లోనూ మ్యాచ్ ఫలితం తేలని సమక్షంలో మరో సూపర్ ఓవర్ ఉంటుంది. ఇందులో వచ్చిన ఫలితం ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button