తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bhajan Lal Sharma: ఉత్కంఠకు తెర..రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్ శర్మ

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జైపూర్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు భజన్ లాల్ శర్మను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. కాగా, సీఎంగా ఎంపికైన భజన్‌లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవ్డే, సంజయ్ పాండే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీపీ జోషి, మాజీ సీఎం వసుంధర రాజే సింధియా హాజరయ్యారు.

ALSO READ: నా హత్యకు సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు

ఏబీవీపీ టూ సీఎం

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్ శర్మ ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన డైరెక్ట్‌గా సీఎంగా ఎంపిక కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. 53 ఏళ్ల భజన్‌లాల్ శర్మ స్వస్థలం భరత్‌పుర కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్‌తో మంచి అనుబంధం కూడా ఉంది. గతంలో ఆయన ఏబీవీపీగా కీలకంగా పనిచేయడంతోపాటు నాలుగు సార్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే పీజీ వరకు చదివిన ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంగనేర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, సీఎం పదవి దక్కించుకున్నారు. సీఎం ఎంపికలో బీజేపీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button