తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Mallareddy: లే లే.. నేను కబ్జా చేయలే: మాజీ మంత్రి మల్లారెడ్డి

గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై (Chamakura Mallareddy) పోలీసు కేసు నమోదైంది. ఆ ఆరోపణలపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. కబ్జాకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Also Read 47 ఎకరాల భూమి కబ్జా… మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

అసెంబ్లీ సమావేశాలకు (Assembly Session) గురువారం హాజరైన మల్లారెడ్డిని మీడియా కబ్జా ఆరోపణలపై వివరణ కోరింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘భూకబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం. భూకబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి (Land) విషయంలో నాకు ఎలాంటి సంబంధం (Relation) లేదు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని.. గిరిజునుల భూమిని వారే కబ్జా చేసి ఉండవచ్చు. ఈ ఘటనలో ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్య చేపట్టినట్లు నేను భావించడం లేదు’ అని తెలిపారు.

Also Read కాంగ్రెస్ కు సమయమేది? 10 రోజులకే విమర్శలా?

వివాదం ఇది

మేడ్చల్ మల్కాజిరి జిల్లా (Medchal Malkajigiri) మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతడి అనుచరులు మోసగించి భూమిని కాజేశారని కొందరు గిరిజనులు శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును స్వీకరించి విచారణ చేపట్టిన పోలీసులు మల్లారెడ్డితోపాటు ఎమ్మార్వోపై కేసులు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button