తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: తెలంగాణ అంటే మీరు, మీ పాలన కాదు కేసీఆర్: విజయశాంతి

బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కి సర్జరీ జరిగి హాస్పిటల్‌లో ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంతమంది ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసమని తెలిపారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్ కు అవసరమేమో కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాదని… అట్లాంటి ప్రకటనలు చేస్తున్న నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ కు ఉందని సూచించారు.

Also Read: రూ.500కే గ్యాస్ సిలిండర్… ఏజెన్సీల ముందు బారులు తీరిన మహిళలు

అంతేకాదు, కొందరు నేతలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా ఉండదని చేస్తున్న ప్రకటనలను కూడా తప్పక తప్పు అని కేసీఆర్ చెప్పల్సిన అవసరం ఉందని తెలిపారు. మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే.. అన్న ధోరణి విడిచి, తెలంగాణలో ప్రజాస్వామ్యం తప్పక పదికాలాలు మంచిగుండాలని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే… తమ బీఆర్ఎస్ నేతలకు అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాల్సిందిగా సూచించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button