తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్… ఏజెన్సీల ముందు బారులు తీరిన మహిళలు

తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా గ్యాస్ ఏజెన్సీలు డాక్యుమెంట్లు తీసుకుంటున్నాయని… వినియోగదారులు ఉదయం 7 గంటల నుంచే ఆయా ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రజలు పనులు మానుకొని మారి గ్యాస్ పాస్ బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్ లో నిల్చుంటున్నారు. అయితే ఈ వార్తలో నిజం లేదని ఇది వదంతని తెలుస్తుంది.

Also Read: టీఎస్‌పీఎస్సీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష… ప్రక్షాళనకు ఆదేశం

గ్యాస్ పథకానికి…ఈ-కేవైసీకి సంబంధం లేదు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేక్​ కస్టమర్లను గుర్తించేందుకే తాము ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్‍ నో యువర్‍ కస్టమర్‍) చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీపం, ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకుని వినియోగిస్తున్న వారి ఈ–కేవైసీ చేయాలని ఆర్డర్స్​ ఉన్నాయంటున్నారు. ఈ– కేవైసీ రెగ్యులర్ ​ప్రాసెస్​ అని, 500 రూపాయలకే గ్యాస్‍ పథకానికి, దీనికి సంబంధం లేదంటున్నారు.

Also Read: హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం సమీక్ష.. మూసీ ప్రక్షాళనపై దృష్టి

ఫేక్‍ కస్టమర్ల కట్టడికి..ఈ కేవైసీ

ఏటా రాష్ట్రంలో ఫేక్‍ సమాచారంతో సబ్సిడీ గ్యాస్‍ సిలిండర్లు వాడుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించడంతో అసలైన లబ్ధిదారులను తెలుసుకోవడానికి ఈ–కేవైసీ చేయాలని ఆయిల్‍ అండ్‍ నేచురల్‍ గ్యాస్‍ మంత్రిత్వ శాఖ రెండు వారాల కింద సర్క్యులర్​ జారీ చేసింది. ఊరురా గ్యాస్‍ సప్లై చేసే ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా ఈ– కేవైసీ చేసుకోవడానికి తమ ఆధార్‍ కార్డుతో వచ్చి.. థంబ్‍ ఇంప్రెషన్‍ వేసి ఫొటో దిగి వెళ్లాలని సూచించింది. తద్వారా తప్పుడు పద్ధతిలో గ్యాస్‍ సిలిండర్లు పొందేవారికి కేంద్ర ప్రభుత్వం చెక్‍ పెట్టే ప్రయత్నం చేస్తోంది.

Also Read: సీఎం ‘బెల్టు’ తీశాడు.. మందుబాబులకు ఇక చుక్కలే!

చెప్పిన వినడంలేదంటున్న ఏజెన్సీలు

అయితే ఇన్ని రోజులుగా ఏజెన్సీ వాళ్లు చెబుతున్న ఈ-కేవైసీ చేసుకోవడానికి రాని జనాలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని వదంతులు రావడంతో ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. ఇది గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కోసం కాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో చేస్తున్నమని అక్కడికి వచ్చిన వారికి చెప్పిన వారు తిరిగి వెళ్లడంలేదని… కాళ్లు నొప్పులు వచ్చేలా క్యూలైన్ లో నిలబడుతున్నారని ఏజెన్సీ వారు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button