తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: కేటీఆర్, హరీశ్ రావులకు నిరసన సెగ… వారి వాహనంపై కోడిగుడ్లతో దాడి

తెలంగాణలో ఎలక్షన్స్ స్టంట్స్ మళ్ళీ మొదలయినట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వేడి వాతావరణం మొదలైంది. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను ఎత్తిచూపుతుంటే, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల వివాదాలను తెరపైకి తెస్తుంది. ఇందులో భాగంగానే నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సాయంత్రం భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురయింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది.

Also Read: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. ప్రధాని మోడీ ప్రకటన

కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి ముందుకు సాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button