తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: కాంగ్రెస్ శ్వేతపత్రంపై బీఆర్ఎస్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక పరిస్థితిపై 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ మేరకు పదేళ్ల కాలంలో ఆర్థిక అరాచకం జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారన్నారు. దశాబ్ధ కాలంగా జరిగిన ఆర్థిక అరాచకాలు ప్రజలకు తెలియాలన్నారు. తర్వాత శ్వేతపత్రంపై చర్చపై హరీష్ రావు.. 4 నిమిషాల ముందు 40 పేజీల బుక్‌లెట్‌ ఇచ్చి చదవకుండానే దానిపై చర్చ జరపడం సరికాదన్నారు. దీంతో సభ అరగంట వాయిదా వేశారు.

ALSO READ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల.. అప్పు ఎంత ఉందంటే?

శ్వేతపత్రంపై హరీష్ రావు ఫైర్

అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ శ్వేతపత్రం తయారు చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రగతి కోణం ఎక్కడా కనిపించలేదని, రాజకీయ ప్రత్యర్థుల దాడి, వాస్తవాల వక్రీకరణే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ALSO READ: కాంగ్రెస్‌‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం… తెలంగాణ ప్రజలకు వరం కానుందా?

బీఆర్ఎస్ నుంచి బుక్‌లెట్ విడుదల

కాంగ్రెస్ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయగా.. మరోవైపు కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ నుంచి ఆస్తులకు సంబంధించి ఓ బుక్‌లెట్ విడుదలైంది. ఇందులో తెలంగాణలో జిల్లాలు, కలెక్టర్ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పెరిగిన వసతులు, కొత్తరోడ్లు, చెత్త సేకరించే వాహనాలు, గురుకులాలు, మనఊరు-మనబడి, కేజీ టూ పీజీ క్యాంపస్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, హరితహారం, ఆలయాల అభివృద్ధి, ఆరోగ్య తెలంగాణ, కాళేశ్వరం, రంగారెడ్డి ఎత్తిపోతల వంటి పథకాలు, విద్యుత్, పరిశ్రమలు, సంక్షేమ పథకాలు, సచివాలయం, అంబేద్కర్ విగ్రహాల నిర్మాణం వంటివి ప్రస్తావిస్తూ 50 పేజీల బుక్‌లెట్ విడుదల చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ఈ పత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button